దోమలు 3500 పైగా జాతులు ఉన్నాయి.
ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని పీల్చి బ్రతుకుతాయి.ఎందుకంటే అవి గుడ్లు పెట్టి వాటి సంతానాన్ని అభివృద్ధి చెయ్యడానికి రక్తంలో ఉండే ప్రోటీన్ అవసరం.
మగ దోమలు ఆకులలో ఉండే పసరు లేదా కాండం లో ఉండే పసరు మాత్రమే పీల్చి బ్రతుకుతాయి.
దోమలు ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు.ఎక్కువ దూరం ప్రయాణించలేవు.
మగ దోమల కంటే ఆడ దోమలు ఎక్కువ కాలం బ్రతుకుతాయి.
మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ వలన 50 అడుగుల దూరం లో ఉన్నా అవి మనల్ని గుర్తించగలవు.
దోమలు లేత రంగుల కంటే ముదురు రంగులను ఎక్కువ ఇష్టపడతాయి.
మన శరీరంలో ఎక్కువ వేడి ఉన్నా కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.శరీరంలో ఎక్కువ వేడి ఉన్న వారి తలపై దోమలు ఎక్కువగా ఎగరడం మనం చూస్తూనే ఉంటాం.
0 Comments