అవళింతలు ఎందుకు వస్తాయి?/Why Do We Yawn?

తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే మనకి అవలింతలు మొదలౌతాయి. మన జీవితం లో కొన్ని వేల సార్లు ఆవలించడం జరుగుతుంది. మనుషులం మాత్రమే కాదు, జంతువులు కూడా అవలిస్తుంటాయి.

మనకి ఒత్తిడిలో ఉన్నా,అలసటగా ఉన్నా, సరిగా నిద్ర లేకపోయినా ఆవలింతలు వస్తూ ఉంటాయి.మన మెదడు మీద ఎక్కువ వొత్తిడి కలిగినప్పుడు మనం ఆవలిస్తూ ఉంటాం.అప్పుడు ఎక్కువ మొత్తం లో చల్లటి గాలిని పీల్చుకుంటాం. మెదడును చల్లబరిచేందుకు, ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అది దోహదం చేస్తుంది.

ఆవలింత అనేది ఒకరి నుంచి మరొకరికి సులభంగా పాకుతుంది. ఎవరైనా ఆవలించేటప్పుడు మనం చూసినా కూడా మనకు ఆవలింత వస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడినా , ఆలోచించినా కూడా చాలా మందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి.



ఇంకో చిన్న విషయం ఏమిటంటే మనల్ని ఎవరైనా గమనిస్తున్నారు అని మీకు అనుమానం వస్తే వారిని చూసి ఒక్కసారిగా ఆవలించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా అనే విషయం.


Post a Comment

0 Comments

–>